మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 18-02-2023 శనివారం దినఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామి ఆరాధించినా...

astro4
మేషం :- కొంతమంది మిమ్మల్ని ఆర్థిక, మాట సహాయం అర్థిస్తారు. అనుకున్న పనులు సాఫీగా పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. ఫైనాన్సు, చిట్ ఫండ్ రంగాల వారికి నిగ్రహశక్తి అవసరం. ఐరన్, సిమెంటు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. 
 
వృషభం :- కుటుంబీకుల మధ్య చిన్న చిన్న విషయాల్లో ఏకీభావం కుదరకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ముఖ్య విషయాల్లో బంధువర్గాల నుండి విమర్శలు, పట్టింపులు ఎదుర్కుంటారు. ఉద్యోగాల్లో మార్పులకై చేయుయత్నాలు వాయిదా పడతాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. 
 
మిథునం :- ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి శుభదాయకం. స్త్రీలకు తల, కళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కోక తప్పదు. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటు సంస్థలలో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. 
 
కర్కాటకం :- మిమ్ములను విమర్శించిన వారే మీ పురోభివృద్ధిని, ఖ్యాతిని గుర్తించి కొనియాడతారు. స్త్రీల లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దంపతుల మధ్య కలహాలు అధికమవుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ వహించండి.
 
సింహం :- స్త్రీలు ఇతరులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. గృహోపకరణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తులు స్థానచలనానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
కన్య :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగుల ఆశయ సిద్ధికి ప్రముఖుల తోడ్పాటు, పెద్దల సహకారం లభిస్తుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి ఆశాజనకం.
 
తుల :- కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలు వాయిదా పడటం వల్ల ఇబ్బందులు తప్పవు. రచయితలకు, పత్రికా రంగాల్లోవారికి నూతన ఆలోచనలు స్పురించగలవు. ప్రైవేటు సంస్థలలో వారికి ఆత్మనిగ్రహం చాలా అవసరమని గమనించండి. దైవ కార్యక్రమాల పట్ల, సాంఘిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
వృశ్చికం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని వ్యవహారాలు నష్టం కలిగిస్తాయి. ఒక కార్యక్రమం మీకు అనుకూలంగా మారుతుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయభేధాలు సమసిపోతాయి. ప్రముఖుల కలయిక వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి.
 
ధనస్సు :- ఆర్థిక లావాదేవీలు వాయిదా పడటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచితవ్యక్తులపట్ల మెళుకువ అవసరం. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. దూరప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
మకరం :- కొబ్బరి, పండ్లు, పూల, పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి లోనవుతారు. పాత రుణాలు తీరుస్తారు. దైవ, పుణ్య, కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులలో మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడుట మంచిదని గమనించండి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నష్టాన్ని కొంతమేరకు పూడ్చుకుంటారు. విదేశీయానం కోసం చేసేయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
 
మీనం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ధన వ్యయం అధికంగా ఉన్నా ఇబ్బందులుండవు. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకు, కోర్టు వ్యవహారాలలో మధ్య వర్తిత్వం వహించడం వల్ల మాట పడకతప్పదు.