బుధవారం, 16 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 14-02-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల...

anjaneya swamy
మేషం :- చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. 
 
వృషభం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ మంచితనం, మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. హోటల్, తినుబండ వ్యాపారులకు, కేటరింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్ధికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి.
 
మిథునం :- రావలసిన ధనం వసూలు కాకపోవటంతో స్పల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు సమర్ధవంతంగా పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. కోర్టు వ్యవహారాలలో చికాకులను ఎదుర్కుంటారు. అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
 
కర్కాటకం :- మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు.
 
సింహం :- ఆపత్సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లను తట్టుకుంటారు. సాహసించి తీసుకున్న నిర్ణయాలు భవివష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. గృహమునకు కావలసిన విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఇంటర్వూలలో ఏకాగ్రత వహిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కన్య :- రాజకీయనాయకుల నుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. బంధు మిత్రుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఉపాధ్యాయులకు పనిలో చికాకులు తప్పవు. మీ మాటలకు సంఘంలో గౌరవం లభిస్తుంది. తీర్థయాత్రలలో చికాకులు ఎదుర్కొంటారు.
 
తుల :- ప్రేమానుబంధాలు, పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో చికాకు తప్పదు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలుగుతారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్థులకు అధికారుల నుండి సమస్యలు తలెత్తినా తోటివారి సహకారం వల్ల సమసిపోగలవు. రావలసిన ధనం కొంత మొతమైనా చేతికందుతుంది. ఇతరుల గురించి హాస్యానికై మీరు చేసిన వ్యాఖ్యానాల వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ప్రయాణాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. హామీలు ఉండటం మంచిదికాదని గమనించండి. లాయర్లకు, డాక్టర్లకు పురోభివృద్ధి లభిస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.
 
మకరం :- మీ చుట్టు ప్రక్కల వారితో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. కొంతమంది మీ గురించి చాటుగా విమర్శలు చేసే ఆస్కారం ఉంది. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంటు, కలప, ఇటుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
కుంభం :- ప్రభుత్వ ఉద్యోగులకు కలిసిస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. బంధువుల రాకపోకలు సంతృప్తినిస్తాయి. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో మెళుకువ అవసరం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
 
మీనం :- రాజకీయ నాయకులకు పదవులందు అనేక మార్పులు ఏర్పడతాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడవచ్చు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. బ్యాంకు లావాదేవీలందు అనుకూలతలుంటాయి.ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. బంధు మిత్రుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.