ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 13-02-2023 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం..

astro10
మేషం :- వస్త్ర, బంగారం వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా నిర్వహిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. విద్యార్థులలో చురుకుదనం కానరాగలదు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
వృషభం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. ముఖ్యమైన విషయాలు, వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచడి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. ఆస్తి పంపకాల విషయంలో సోదరీ సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
 
మిథునం :- వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. కోర్టు వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. ప్రముఖులను కలుసుకుంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సాహస ప్రయత్నాలు విరమించండి. స్త్రీలు అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కుంటారు. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
సింహం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు షాపింగ్ ఏకాగ్రత అవసరం. దూరప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులు సభ సమావేశాలలో పాల్గొంటారు. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. మీ సంతానం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.
 
కన్య :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. వీలైనంతవరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. టి.వి. రేడియో, సాంకేతిక రంగాలలో వారికి గుర్తింపు లభిస్తుంది.
 
తుల :- స్త్రీలు ధనవ్యయం విషయంలో జాగ్రత్త వహించ వలసి ఉంటుంది. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు సభ సమావేశాలలో పాల్గొంటారు.
 
వృశ్చికం :- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
 
ధనస్సు :- మీ పనితీరు, వాగ్ధాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఎంతటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దల సలహాను పాటించిమీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కళాకారులకు, రచయితలకు పత్రికా రంగాలలో వారికి అనుకూలమైన కాలం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది.
 
కుంభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రముఖులతో కీలకమైన వ్యవహరాలు చర్చలు జరుపుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ఒత్తిడి, అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది.
 
మీనం :- మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వాహనం నిదానంగా నడపటం క్షేవదాయకం.