గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

తేదీ 09-02-2023 గురువారం దినఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

Pisces
మేషం:- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. కుటుంబీకులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వూలలో జయం చేకూరుతుంది. రాజకీయ నాయకులకు పదవు లందు అనేక మార్పులు ఏర్పడతాయి.
 
వృషభం :- ప్రైవేటు సంస్థలలో పొదుపు చేయటం మంచిది కాదని గమనించండి. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు, అనుభవం గడిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతన సమస్యలు తలెత్తుతాయి. నూతన ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
మిధునం:- గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. సామూహిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ట్రాన్స్పోర్టు, ఎక్స్పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. 
 
కర్కాటకం:- దంపతులు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. మీ ఆదాయమునకు మించి ఖర్చు చేయుట వలన ఆందోళన పడక తప్పదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. కొంత మంది సూటీపోటీ మాటల వల్ల మీరు మానసిక ఆందోళనకు గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది.
 
సింహం:- కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారంఉంది.
 
కన్య:- రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. ఆర్ధిక విషయాల్లో గోప్యంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదురుతుంది.
 
తుల:- మీ శ్రీమతి సలహా పాటించటం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కాంట్రాక్టర్లకు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి.
 
వృశ్చికం:- వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. నిరుద్యోగులు ఉపాధి పధకాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరి, సోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు.
 
ధనస్సు:- రావలసిన ధనం చేతికందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మకరం:-స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. మీ ఆశయ సాధనకు నిరంతర కృషి అవసరం అని గమనించండి. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
కుంభం:- నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు.
 
మీనం: - ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. ఎవరికీ హామీలు ఉండం మంచిది కాదని గమనించండి. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కుంటారు.