గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 08-02-2023 బుధవారం దినఫలాలు - శ్రీ మహావిష్ణువును ఆరాధించిన..

Sagitarus
మేషం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చాలా అవసరం. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు టీ.వీ చానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది.
 
వృషభం :- స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. విద్యార్థులకు మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. వ్యాపారాల్లో కొనుగోలుదార్లు, పనివారలను ఓ కంట కనిపెట్టుకోవటం ఉత్తమం. వాహనచోదకులకు జరిమానాలు, మరమ్మతులు వంటి చికాకులెదురవుతాయి.
 
మిథునం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలతో అతిగా సంభాషించటం వల్ల అపార్థాలకు గురికావలసి వస్తుంది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీపై సెంటిమెంట్లు, ఎదుటివారి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. రావలసిన ధనం వాయిదాపడుట వల్ల ఆందోళనకు గురవుతారు. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ప్రియమైన వ్యక్తులను కలుసుకుంటారు.
 
సింహం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మీ కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. రవాణా రంగాలలోని వారికి చికాకులు తప్పవు.
 
కన్య :- పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలలోనూ, బ్యాంక్ వ్యవహారాలలోను ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది.
 
తుల :- వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి అభివృద్ధి కానవస్తుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
ధనస్సు :- సాహస ప్రయత్నాలు విరమించండి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకువస్తాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం.
 
మకరం :- ఆర్థిక పరిస్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. పరిశోధనల విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఏమంత పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు విజయం సాధిస్తారు.
 
కుంభం :- చేస్తున్న వ్యాపారాలపై దృష్టి పెట్టినా మంచి లాభాలను పొందుతారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థలతో లావాదేవీలు వాయిదాపడతాయి. విద్యార్థులకు తోటివారు, అధ్యాపకులతో చికాకులు అధికం. పొదుపు చేయాలనే ఆలోచన కార్యరూపందాల్చుతుంది.
 
మీనం :- ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దైవ, పుణ్య కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అధిక శ్రమాంతరం వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి చిన్న చిన్న విషయాలలో ఉద్రేక పడటం మంచిది కాదని గ్రహించండి.