సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (10:12 IST)

తేదీ 06-02-2023 సోమవారం దినఫలాలు - శంఖరుడిని ఆరాధించినా మీ సంకల్పం...

Scorpio
మేషం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. పాత మిత్రుల కలయికతో మీలో కొంత మార్పు వస్తుంది. నిర్మాణపనులో చికాకులు తప్పవు. ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. 
 
వృషభం :- ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. నిర్మణ కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం :- ఇతర ఆలోచనలు విరమించుకుని ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఓర్పుతో పరిస్థితులను భరించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. 
 
కర్కాటకం :- సన్నిహితుల కిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సంతానం ఆరోగ్య విషయాలపై శ్రద్ధ, ఏకాగ్రత చాలా అవసరం. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచన స్పురిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
సింహం :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారులకు శుభదాయకం. గృహంలో వస్తువు పోవడానికి అవకాసం ఉంది. జాగ్రత్తవహించండి. 
 
కన్య :- కుటుంబ వాతావరణం ఉల్లాసాన్ని ఇస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి తగాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి, ఉద్యోగాలయందు ఉన్నత స్థితిలో ఉంటారు. స్థిరమైన నిర్ణయం తీసుకోలేకపోవడంవల్ల మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి.
 
తుల :- గృహోపకరణాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రుణయత్నాల్లో అనుకూలత లుంటాయి. దైవ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ధన, విద్య, ఆరోగ్య విషయాలు ఆనందదాయకంగా ఉంటాయి. ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతగా మెలుగుతూ తమ పనులను సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి.
 
ధనస్సు :- నిత్యావసర వస్తు స్టాకిస్టులు కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఎటువంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించటం అన్నివిధాలా క్షేమదాయకం. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ఆత్మవిశ్వసం రెట్టింపవుతుంది. వాహన చోదకులకు జాగ్రత్త అవసరం.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పదు. పొదుపు ఆవశ్యకతను బాగుగా గుర్తిస్తారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. ప్రేమికులకు మధ్య ఎడబాటు తప్పదు. క్రయ విక్రయ రంగాల్లో వారికి లాభదాయకం.
 
కుంభం :- బంధు, మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచితవ్యక్తుల పట్ల మెళుకువ అవసరం. విదేశీ యత్నాలు వాయిదాపడతాయి. ఏజెన్సీ, లీజు, నూతన టెండర్లు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దూర ప్రయాణాలల్లో మెళకువ వహించండి.
 
మీనం :- స్త్రీల కోరికలు నెరవేరడంతో గృహంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల యత్నలు ఫలిస్తాయి. వాహనం ఇతురులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు వంటివి తలెత్తుతాయి. విద్యార్థినులలో మానసిక ధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి.