గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 21-02-2023 మంగళవారం దినఫలాలు - ఆంజనేయస్వామిని ఆరాధించడంవల్ల శుభం...

Gemini
మేషం :- విదేశీయత్నాలు ఫలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
వృషభం :- అకాలభోజనం, శ్రమాధికవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. స్త్రీలకు పనిభారం అధికం. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. రాజకీయ నాయకులు ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మిథునం :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. పండ్ల, పూల, కొబ్బరి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి.
 
కర్కాటకం :- బంధువుల రాక వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సోదరీ సోదరులతో విభేదాలుతప్పవు.
 
సింహం :- బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు పునరావృతమవుతాయి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం వంటి చికాకు లెదురవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
కన్య :- ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులు అధిమవుతాయి. వాతావరణంలో మార్పుతో స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. దూర ప్రయాణాలలో మెళుకు అవసరం. మీరు చేసే కృషి వల్ల మీ ప్రతిభ వెలుగులోనికి వచ్చి మంచి విజయం సాధిస్తారు. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం.
 
తుల :- వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగి లాభాలను గడిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ వంటివి ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీల ఆరోగ్యం మెరుగు పడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. బంధువులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవటంతో నిరుత్సాహానికి గురవుతారు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. రాజకీయ నాయకుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. రాబోయే ఖర్చులకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు.
 
ధనస్సు :- కుటింబీకులతో కలసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికాక విసుగు కలిగిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. స్వయంకృషితోనే మీ పనులు సానుకూలమవుతాయి. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటంమంచిది కాదు. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక బలపడుతుంది. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు.
 
కుంభం :- ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారాల్లో ఒక నష్టం మరో విధంగా పూడ్చుకుంటారు. అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి, సత్ఫలితాలు లభిస్తాయి. వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. ప్రేమికులకు, నూతన దంపతులకు ఎడబాటు తప్పదు.
 
మీనం :- ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. విందుల్లో పరిమితి పాటించండి. ఉద్యోగస్తులకు స్థానచలనం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. విద్యార్ధుల అత్యుత్సాహం అనర్ధాలకు దారితీయవచ్చు.