గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 23-02-2023 గురువారం దినఫలాలు - లక్ష్మీ కుబేరుడిని ఆరాధించిన ఆర్థికాభివృద్ధి..

Cancer
మేషం :- రాజకీయ నాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ శ్రీమతి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించు వహించడం మంచిది. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
వృషభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటంవల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు ఇరుగు పొరుగువారి నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అసవరం.
 
మిథునం :- గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలిసివస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు యత్నిస్తారు. సాహిత్య రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
కర్కాటకం :- రాజకీయ నాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. ఉపాధ్యాయులకు విద్యార్థులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించిన సద్వినియోగంచేసుకోలేరు. 
 
సింహం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివాలతో చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, అదుపు చాలా అవసరం.
 
కన్య :- ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవలనే ఆలోచనస్ఫురిస్తుంది. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు. చిన్న చిన్న సమస్యలు లెదురైనా పరిష్కరించుకుంటారు. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు ఎదుటివారు యత్నిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి.
 
తుల :- వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి ఉండదు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. విదేశీయాన యత్నాల్లో ఆటంకాలు తప్పవు. దంపతుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం :- ముఖ్యులలో వచ్చిన మార్పు మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. విద్యార్థులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రుణం తీర్చటానికై చేయుయత్నం వాయిదా పడుతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభించిన సద్వినియోగం చేసుకోలేరు.
 
ధనస్సు :- విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ముందుగా ఊహించిన ఖర్చులు కావటంతో ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. కుటుంబంలో అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.
 
మకరం :- ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్ధినులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. బంధువుల రాకతో గృహంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు స్ఫురిస్తాయి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. స్త్రీలు కళ్ళు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. కుటుంబీల ఆరోగ్యం పట్లప్రత్యేకశ్రద్ధ కనబరుస్తారు.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి. స్థిర చరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడం వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.