ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 27-02-2023 సోమవారం దినఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన...

Scorpio
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తుల పనితీరును అధికారులు ప్రశంసిస్తారు. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిమ్ములను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టడం ఉత్తమం. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
వృషభం :- ఓర్పుతో సమస్యలను అధికమిస్తారు. అనూహ్యమైన సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు సంతృప్తి కానవస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. బ్యాకింగ్ వ్యవహారాలో మెళుకువ వహించండి. 
 
మిథునం :- సమస్య చిన్నదే అయినా తేలికగా తీసుకోవటం మంచిది కాదు. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
 
కర్కాటకం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించగలుగుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూర చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మానసిక ప్రశంతత చేకూరుతుంది.
 
సింహం :- సభలు, సమావేశాల్లో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో అసహనానికి లోనవుతారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్పమార్పులు చోటుచేసుకుంటాయి. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. సహోద్యోగులతో స్పర్థలు తలెత్తుతాయి. కుటుంబంలో కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి.
 
తుల :- మార్కెటింగ్ రంగాల్లో వారు, రిప్రజెంటివ్‌లకు ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించడంవల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది.
 
వృశ్చికం :- అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. ఇతరుల విషయాలకు వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. చిన్న తరహా కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో చికాకు తప్పదు.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణ విముక్తులు కావడంతోపాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ఎల్.ఐ.సి., పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన తప్పవు.
 
కుంభం :- వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడుతుంది. మీ యత్నాలకు మిత్రులు సహకరిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలు అధికమవుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ అవసరం.
 
మీనం :- విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు అధిక శ్రమ, విశ్రాంతి లోపం వంటివి ఎదుర్కోక తప్పదు. చేపట్టిన వ్యాపారాల్లో నష్టాలను కొంతమేరకు పూడ్చుకుంటారు. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరదు. ముఖ్యమైన విషయాలు కుటుంబీకులకు తెలియజేయడంమంచిది.