శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 25-02-2023 శనివారం దినఫలాలు - అభయ ఆంజనేయస్వామిని పూజించిన..

Leo
మేషం :- వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. దైనందిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబీకులు కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిదని గమనించండి.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. మీ కార్యక్రమాలు పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం మంచిదని గమనించండి.
 
మిథునం :- ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. కొబ్బరి, పండ్ల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. మీ నిర్లక్ష్యం వల్ల గృహములో విలువైన వస్తువులు చేజారిపోతాయి. జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తుల విధి నిర్వహణలో మంచి గుర్తింపు లభిస్తుంది. షాపింగ్ విషయాలలో మెళుకువ అవసరం.
 
కర్కాటకం :- సన్నిహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమాస్తాలకు ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం భవిష్యత్తు కోసం పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలుంటాయి. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
సింహం :- ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఐరన్, కలప, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు మిశ్రమ ఫలితం. బంధువుల రాక వల్ల ఖర్చులు అధికమవుతాయి.
 
కన్య :- హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాలలోవారికి పురోభివృద్ధి. ఋణానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు చుట్టుపక్కల వారి నుండి గౌరవం, ఆదరణ పొందుతారు. ప్రేమికుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతుల చేపట్టే ఆస్కారం ఉంది.
 
తుల :- నిరుద్యోగులకు, వ్యాపార రంగాల వారికి నిరుత్సాహం తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులను ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. స్త్రీలకు విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
వృశ్చికం :- ప్రైవేటు, పత్రిక రంగాల్లో వారికి అధికారులతో సమస్యలు తొలగిపోతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్ధుల ఆలోచనల పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది.
 
ధనస్సు :- స్త్రీలకు అకాలభోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. రాజకీయ, సాంకేతిక వర్గాలు అనుకున్నది సాధిస్తారు. లీజు, ఏజెన్సీ, నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
 
మకరం :- మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీవారు, శ్రీమతి మధ్య అభిప్రాయభేధాలు సమసిపోతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి అధికమవుతాయి.
 
కుంభం :- వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. రాజకీయవర్గాలకు కొద్దిపాటి ఒత్తిడులు ఉంటాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. ప్రముఖులకు విలువైన కానుకలందించి వారిని ఆకట్టుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య చిన్న చిన్న కలహాలు, అభిప్రాయబేధాలు తప్పవు.
 
మీనం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో మనస్పర్థలు తలెత్తుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. సోదరుల నుంచి మాట సహకారం అందుతుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్థులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. పలుకుబడి పెరుగుతుంది.