ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

తేదీ 28-02-2023 మంగళవారం దినఫలాలు - రాజరాజేశ్వరి అమ్మవారిని ఎర్రని పూలతో...

Sagitarus
మేషం :- ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని అనుకున్న పనులు పూర్తికావు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసివస్తాయి. రాజకీయనాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తి అవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
వృషభం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. బంధు మిత్రుల రాకతో ఖర్చులు పెరిగినా భారమనిపించవు. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం దేవాలయాలు సందర్శిస్తారు. మీ కుటుంబీకులతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
 
మిథునం :- బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ప్రైవేటు రంగాలలో వారికి ఇంజనీరింగ్ రంగాలలో వారు అశాంతికి లోనవుతారు. ఆలయ సందర్శనాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
కర్కాటకం :- అందరితో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలతో అతిగా వ్యవహరించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. మీ సంకల్ప సిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. 
 
సింహం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు మీరే చూసుకోవటం మంచిది. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టడం మంచిది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రుల నుంచి మొహమ్మాటం, ఒత్తిడి ఎదుర్కుంటారు.
 
కన్య :- ఆలయాలను సందర్శిస్తారు. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
తుల :- విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, వేడుకల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానిక్ రంగాలవారికి బరువు బాధ్యతలకు అధికమవుతాయి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల అవగాహన, ధ్యేయం పట్ల ఏకాగ్రత వంటివి ఏర్పడతాయి.
 
ధనస్సు :- విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల అధికారులతో మాటపడవలసి వస్తుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ముఖ్యుల కోసం షాపింగులు చేస్తారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ వాహనం ఇతరులకు కిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యాలు, వేడుకల్లో చురుకుగా పాల్గొంటారు. వైద్య రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత చాలా అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం :- ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం. గృహ నిర్మాణంలో మార్పులు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆటంకాలు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అసాధ్యమనుకున్న పనులు సునాయసంగాపూర్తి చేస్తారు.
 
మీనం :- ఆర్థికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల వల్ల ఇక్కట్లు ఎదురవుతాయి. రాజీ ధోరణితో వ్యవహరించటం వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది.