బుధవారం, 15 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-03-2023 నాటి మీ రాశి ఫలితాలు.. శ్రీవారిని ఆరాధిస్తే..?

Sagitarus
శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం:- కొన్ని వ్యవహరాలు అనుకూలించినా మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. హోటల్ తినుబండార వ్యాపారులకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చినా ఇబ్బందులు తప్పవు.
 
వృషభం: సంఘంలో గౌరవం కన్నా అవమానాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల ఏకాగ్రత అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉమ్మడి వ్యవహారాలు, సంస్థలు, ప్రాజెక్టులు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. విద్యార్థులకు చదువులపట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
మిథునం:- మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారంలో ఎంతో పక్కగా తయారు చేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. పాత వస్తువులను కొనుగోలు చేస్తారు. పీచు, నార, లెదర్, ఫోము వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
 
కర్కాటకం:- పత్రికా సంస్థలోని వారికి చిన్న చిన్న పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. మీ గౌరవ, ఆత్మాభిమానాలకు భంగం కలిగే సూచనలున్నాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
సింహం: ఆర్ధికంగా బాగుగా స్థిరపడ్డారు. మీ సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. అవసరాలు తగ్గించుకుని రుణం తీర్చటానికి యత్నించండి. విద్యార్థులు చదువుపై అధికమైన శ్రద్ధ కనపరుస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కన్య: బంధువులను కలుసుకుంటారు. ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవటానికి యత్నించండి. పాత మిత్రుల కలయిక ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రతీ చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. విద్యార్థులలో నూతన ఉత్సాహం కానవస్తుంది.
 
తుల:- ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులు తోటివారితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృశ్చికం: వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. ఉపాధ్యాయు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
ధనస్సు : వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రిప్రజెంటేటివ్ లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు.
 
మకరం : సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. రాజకీయనాయకులకు దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఆదాయానికి  తగినట్లుగా ఖర్చులు ఉంటాయి. ఆడిట్, అక్కౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం.
 
కుంభం: కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఏ ప్రయత్నం కలిసి రాకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు.
 
మీనం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ప్రముఖులను కలవటం వల్ల ముఖ్య విషయాలు చర్చకు వస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.