గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (11:01 IST)

ప్రధాని, సీఎం జగన్, కేసీఆర్ జాతకాలు బాగున్నాయి..

jagan
ఉగాది సందర్భంగా శ్రీ శారదా పీఠంలో వేడుకలు జరిగాయి. ఉగాదిని పురస్కరించుకుని శారదాపీఠం గంటల పంచాంగాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయన్నారు. 
 
కాల సర్పదోషం కారణంగా మూడేళ్లుగా దేశం ఇబ్బందులు పడిందని చెప్పారు. ఈ ఏడాది చతుర్గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతుంది. దీనివల్ల కూడా దేశంలో ఇబ్బందులు తప్పవన్నారు. ఈ ఏడాదిలో వడదెబ్బ, ఎండలు ఎక్కువగా వుంటాయన్నారు. జూలై- సెప్టెంబర్ నెలల మధ్య ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.