1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 22 మార్చి 2023 (22:22 IST)

సంప్రదాయబద్ధంగా సీఎం దంపతుల ఉగాది వేడుకలు

AP CM Jagan
AP CM Jagan
ఉగాదిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. సీఎం జగన్ ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగను  జరుపుకున్నారు.
 
పలువురు మంత్రులు, అధికారులు, నాయకులు, మద్దతుదారులతో హాజరైన ముఖ్యమంత్రి అధికారిక గృహంలో శోభాకృత నామ ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. 
 
తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ముఖ్యమంత్రి దంపతులు అతిథులకు స్వాగతం పలికారు. వేడుకల్లో పాల్గొన్న పురోహితులు, కళాకారులు, గాయకులను సీఎం దంపతులు సత్కరించారు.