సంబంధిత వార్తలు
- వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఏపీ సర్కారు స్పందన శూన్యం : కేంద్రం
- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు ... తేల్చేసిన కేంద్రం
- చైల్డ్ కేర్ లీవ్‌ను ఎపుడు వాడుకోవచ్చు... క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
- ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ సర్కారు.. ఏంటది?
నేటి నుంచి శుక్రవారం వరకు ఏపీలో తేలికపాటి వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ శ్రీలంక నుంచి ఈశాన్య మధ్యప్రదేస్ వరకు ద్రోణి కొనసాగడమే ఇందుకు కారణమని తెలిపారు. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో మంగళవారం అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, ఏలూరు, కాకినాడ తదితర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచన చేసింది.
