బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (11:57 IST)

మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ సర్కారు.. ఏంటది?

ys jagan
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.100 కోట్ల వ్యయంతో మూడు పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం ఒక గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర విత్త మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. 
 
ఈ పాలిటెక్నిక్ కాలేజీలను నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, కడప జిల్లాలోని మైదుకూరుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమో కోర్సుల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఆయా ప్రాంతాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని పేర్కొంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ మరింత మెరుగుపడి విద్య పూర్తికాగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని తెలిపారు. ఈ మూడుక కాలేజీల్లో ఒకదాన్ని రూ.30 కోట్లతో తన నియోకవర్గం డోన్ పరిధిలోని బేతంచర్లలో నిర్మిస్తామని ఆయన తెలిపారు.