గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (09:34 IST)

ఏపీ ఐసెట్‌ 2023కు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఉన్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023కు దరఖాస్తులను ఆహ్వాన ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 20వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. 
 
దరఖాస్తు రుసుంను రూ.650గా చెల్లించాల్సి ఉంటుంది. బీసీ విద్యార్థులు అయితే రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చొప్పున చెల్లించాలని పేర్కొంది. మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం అడ్మిట్‌ కార్డులను మే 20 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఈ పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, అలాగే, మధ్యాహ్నం 3 గంటల నుంచి నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు షిఫ్టులలో నిర్వహించనున్నట్టు ఐసెట్‌ కన్వీనర్‌ తెలిపారు.