ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 మార్చి 2023 (16:24 IST)

జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యులపై దాడి చేస్తారా? పవన్ కళ్యాణ్ ప్రశ్న

pawan kalyan
ఏపీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఏడో రోజైన సోమవారంలో అసెంబ్లీ సాక్షిగా టీడీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిపై వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌తో పాటు మరికొందరు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జీవో నం.1పై చర్చ కోరితే టీడీపీ సభ్యలపై దాడి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలను దురదృష్టకరమైనవి, ప్రజూస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేవిగా ఉన్నాయన్నారు. ప్రజల గొంతు నొక్కే జీవో నంబర్ 1పై చర్చను కోరిన టీడీపీ ఎమ్మెల్యేలపై అధికారపక్షం దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు. 
 
ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయన్నారు. ముందుగా చట్ట సభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభా నాయుకుడిగా ముఖ్యమంత్రిపైనా, సభ ప్రిసైండిగ్ అధికారిపైనా ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.