శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (12:14 IST)

ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి ఆ రాష్ట్ర వైద్య శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ ఖాళీలను వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్, పర్మినెంట్ ప్రతిపాదికన భర్తీ చేయనుంద. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సివుంది. 
 
వీటిని ఈ నెల 23 నుంచి 27వతేదీ వరకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలను విజయవాడలోని పాత ప్రభుత్వాసుత్రిలో నిర్వహిస్తారు. డీఎంఈ కార్యాలయంలో ఐదు రోజుల పాటు ఇంటర్వ్యూ ప్రక్రియ కొనసాగుతుందని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ సోమవారం మీడియాకు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం వైద్య ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.