గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2023 (16:59 IST)

స్కూల్ బస్సు డ్రైవర్‌కు గుండె పోటు.. 13 ఏళ్ల స్టూడెంట్ ఏం చేశాడంటే? (video)

bus driver
స్కూల్ బస్సు ప్రమాదానికి గురికావాల్సింది. అయితే ఓ 13 ఏళ్ల బాలుడు ఆ ప్రమాదం నుంచి అందరి ప్రాణాలు కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. స్కూల్ బస్సు డ్రైవర్‌కు డ్రైవర్ చేస్తుండగా గుండె పోటు వచ్చింది. దీంతో బస్సు అదుపు తప్పింది. 
 
దీన్ని గమనించిన 13 ఏళ్ల బాలుడైన విద్యార్థి దిల్లాన్ వెంటనే డ్రైవర్ క్యాబిన్‌లోకి వచ్చి వెంటనే స్టీరింగ్‌ను చేతిలో పట్టుకుని బ్రేక్ లీవర్‌పై కాలు పెట్టి నిల్చున్నాడు. దీంతో బస్సు ఆగిపోయింది. అంతే అందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
బస్సు బ్రేక్ పై కాల్ వేసి, వెంటనే 911కు కాల్ చేయాలంటూ తోటి విద్యార్థులను దిల్లాన్ కోరడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇక దిల్లాన్ బస్సును ప్రమాదం నుంచి కాపాడేందుకు వ్యవహరించిన తీరుపై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.