సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (11:40 IST)

సవతి తండ్రి చేసిన పని.. పచ్చబొట్టు చెరగడం కోసం.. చిన్నారుల చర్మాన్ని?

Tatoo
Tatoo
సవతి తండ్రి ఇద్దరు పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పచ్చబొట్లు పొడిచి చిత్రహింసలకు గురిచేసిన అతను వాటిని చెరిపేందుకు చిన్నారుల చర్మాన్ని కత్తిరించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికా, టెక్సాస్‌కు చెందిన గన్నర్ ఫార్ అనే మహిళకు ఐదు, తొమ్మిదేళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె భర్తతో విడిపోయి మేగాన్ మే పార్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని పిల్లలతో కలిసి వుంటోంది.
 
ఈ క్రమంలో పిల్లలకు పచ్చబొట్టు వేయించారు. కానీ ఇది పిల్లలకు ఇష్టం లేదు. కానీ బలవంతంగా వారికి పచ్చబొట్టు పొడిపించారు. అయితే వారిని చూసేందుకు వారి తండ్రి రావడంతో అసలు విషయం బయటపడింది. 
 
దీంతో వద్దన్నా పచ్చబొట్టు పొడిపించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేస్తారని జడుసుకున్న గన్నర్, మేగాన్ పిల్లల పచ్చబొట్లను చెరిపేందుకు ప్రయత్నించారు. 
 
ఇందుకోసం నిమ్మరసం వేశారు. గీరటం చేశారు. అయితే పచ్చబొట్టు చెరగలేదు. దీంతో పిల్లల చర్మాన్ని కత్తిరించి.. పచ్చబొట్టును తొలగించారు. ఈ ఘటనతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు.