1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:54 IST)

హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదం... నలుగురి సజీవదహనం

fire accident
హైదరాబాద్ నగరంలోకి కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ టింబర్ డిపోలో మంటలు చెలరేగి నలుగురు మంటల్లో సజీవదహనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. టింబర్ డిపోలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో పక్క పక్కనే ఉన్న ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లమీదకు పరుగులు తీశారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. మృతులు వరంగల్ జిల్లాకు చెందిన రమేష్, సుమ, బాబుతో పాటు మరో కార్మికుడిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.