1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాను.. బ్రెయిన్ కంట్రోల్ కావడంలేదు.. అందుకే విడిచి వెళుతున్నా..

varada siva
ఆన్‌‍లైన్ క్రీడలకు మరో ప్రాణం పోయింది. ఈ గేమ్‌లకు బానిసై భారీగా డబ్బులు పోగొట్టుకున్న ఉద్యోగి ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. 
 
డీఏఈ కాలనీకి చెందిన వరద శివ (31) అనే వ్యక్తి అణు ఇంధన సంస్థ (ఎన్.ఎఫ్.సి)లో వర్క్ అసిస్టెంట్‌గా గత ఏడేళ్ళ నుంచి పని చేస్తున్నాడు. ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన ఆయనకు మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్య ప్రభాతతో ఏడాదిన్నర కుమారుడు వేదాంష్ కూడా ఉన్నాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పంటి నొప్పితో బాధపడుతూ వచ్చిన భార్య.. చికిత్స నిమిత్తం ఈ నెల 2వ తేదీన జోగులాంబ జిల్లాలోని గద్వాలలో పుట్టింటిలో వదిలివచ్చాడు. ఆ తర్వాత మొబైల్‌లో ఆన్‌లైన్ ఆడాడు. అదే అతని పాలిట శాపంగా మారింది. లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల్లో కూరుకునిపోయాడు. 
 
ఈ క్రమంలో బుధవారం ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు. రాత్రివేళ భర్తకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో సెక్యూరిటీ గార్డు కమలయ్యకు భార్య సమాచారం ఇచ్చింది. ఆయన తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. గదిలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఆత్మహత్య లేఖలో.. "వేదాంష్‌ (కొడుకు) నీకోసం ఏమీ చేయలేకపోతున్నా, నా బ్రెయిన్‌ను నేను కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నా. నా చావుకు నేనే కారణం. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను క్షమించాలి. నాకు వేరే దారి లేక ఈ నిర్ణయం తీసుకున్నాను.. క్షమించాలి" అని  సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు.