1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (08:29 IST)

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - కారులో కూర్చొని నిప్పంటించుకున్న ప్రేమికులు

fire
తమ పెళ్లికి పెద్దలు నిరాకరించడాన్ని ఆ ప్రేమజంట జీర్ణించుకోలేక పోయింది. పెద్దల నిర్ణయంతో కలిసి జీవించలేమని భావించిన ఆ ప్రేమికులు చావులోనైనా ఒక్కటిగా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతే కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లాలో జరిగింది. 

 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన యశ్వంత్ - జ్యోతి అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. ఈ విషయం తెలిసిన పెద్దలు వ్యతిరేకించారు. కానీ, వారు మాత్రం పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. అయితే, పెద్దలు మాత్రం వారి పెళ్లికి అంగీకరించలేదు. ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా వారు కనికరించలేదు. దీంతో తామిద్దరం ఒక్కటయ్యే మార్గం వారికి కనిపించక పోవడంతో ఇక మరణమే శరణమని భావించారు. 

 
అంతే.. శనివారం రాత్రి మంగుళూరుకు చెరుకున్న ఆ ప్రేమ జంట అక్కడ ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపుగా బయలుదేరారు. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న వారు, తాము చనిపోతున్నట్టు కుటుంబ సభ్యులకు చేరవేరశారు. ఇరు కుటుంబాల పెద్దలు అప్రమత్తమయ్యేలోపు ఘోరం జరిగిపోయింది. 

 
ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఉడుపి జిల్లా బహ్మార్వ తాలూకా హెగ్గుంజె సమీపంలో కారుపై పెట్రోలు పోసి లోపల కూర్చొని నిప్పంటించుకున్నారు. ఇది గమనించిన స్థానికులు అప్రమత్తయ్యేలేపు మంటలు పెద్దవి కావడంతో వాటిని అదుపుచేయలేక పోయారు. ఫలితంగా ఆ ప్రేమజంట కారులోనే ఒక్కటిగా సజీవదహనమైపోయారు. దీనిపై ఉడుపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.