సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2023 (11:01 IST)

కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిది..

తెలంగాణ సర్కారు అందించిన కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులు, సొంత నిధులతో పోచంపల్లి పట్టుచీర, దోతి, టవల్‌ను లబ్ధిదారులకు కానుకగా అందజేశారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 
 
భువనగిరి పట్టణం, మండలానికి కలిపి మొత్తం 124 చెకులకు గాను సుమారు 1 కోటి 25 లక్షలకు పైగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఈ సమావేశంలో జరిగింది.