శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 ఏప్రియల్ 2023 (14:32 IST)

సింహం నుంచి ఆవులను కాపాడిన వీధి శునకం

Black Dogs
గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ సమీపంలోని ఓ గ్రామంలో వీధి కుక్క ఆవుల గుంపును వెంబడిస్తూ పెద్దగా మొరిగే శబ్దాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. అకస్మాత్తుగా ఆ వీడియోలో సింహం కనిపించింది. కానీ కుక్క వెనక్కి తగ్గలేదు. అది మొరగడం కొనసాగిస్తుంది
 
ఆవులను సింహం బారి నుంచి రక్షించే దిశగా శునకం మొరుగుతూ కనిపించింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. అయితే తాజాగా ఈ వీడియో మళ్లీ తెరపైకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 
ప్రమాదకరమైన వన్యప్రాణుల నుండి ఆవులను రక్షించినందుకు, దాని ధైర్యసాహసాల కోసం ప్రజలు శునకాన్ని ప్రశంసిస్తున్నారు.