ఆపద సమయంలో తల్లిని కాపాడిన బుడ్డోడు (వీడియో)
mother-son
విదేశాల్లో ఓ ఇంటి ముందు పొడవాటి ఇనుప దూలంపై నిచ్చెనపై నిలబడి ఓ మహిళ పనిచేస్తుంది. అప్పుడు ఆమె నిలబడి ఉన్న నిచ్చెన కింద పడిపోయింది. అంతే ఆ మహిళ అడ్డంగా వున్న ఇనుప దూలాన్ని గట్టిగా పట్టుకుంది.
అలానే వేలాడుతూ కనిపించింది. వెంటనే పక్కనే వున్న బాలుడు.. తీవ్రంగా ప్రయత్నించి.. ఆ నిచ్చెనను నిలబెట్టాడు. తన తల్లిని కాపాడేందుకు ఈ బుడ్డోడు తన సాయశక్తులా ప్రయత్నించి.. నిచ్చెనను నిలబెట్టాడు.
ఎలాగోలా ఆ మహిళ కూడా కాలతో ఆ నిచ్చెనను అందుకుని.. కిందకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆ బాలుడి సమయోచిత బుద్ధి భలే అంటూ ప్రశంసిస్తున్నారు.
Definitely beyond his ability & science. But when he had to do it, nothing could stop him! ❤️
Kudos for his presence of mind & courage
