శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (14:24 IST)

మహిళల బాడీ పార్ట్స్‌ను వివరిస్తూ... 20 మందిని లోబర్చుకున్న మాయలోడు..

arrest
బరువు తగ్గేందుకు తన వద్దకు వచ్చే మహిళలను లొంగదీసుకుని వారిని వేధిస్తున్న ఓ పోకిరిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. కేబీహెచ్‌బీ కాలనీలో అరెస్టు అయిన చంద్రశేఖర్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈయన ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 20 మందిని మహిళలను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. 
 
హెర్బల్ లైఫ్ మేనేజరుగా పని చేసే చంద్రశేఖర్.. బరువు తగ్గేందుకు తన వద్దకు వచ్చే మహిళలను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అర్థరాత్రి న్యూడ్ ఫోన్ కాల్స్ చేస్తూ వేధించేవాడు. మహిళల బాడీ పార్ట్స్‌ను వర్ణిస్తూ వారికి వీడియో కాల్స్ చేసేవాడు. అలా ఏకంగా 20 మందిని మోసం చేసినట్టు సమాచారం. ఇది ఇప్పటివరకు దొరికిన లెక్క మాత్రమే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
యేడాది క్రితం హెర్బల్ లైఫ్ మేనేజరుగా చేరిన చంద్రశేఖర్.. తన మాటల గారడీతో మహిళలను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. వారి ముందు మంచి వాడిలా నటిస్తూ, ఆ తర్వాత చనువు పెంచుకోవడం, చివరకు న్యూడ్ కాల్స్ పేరుతో వేధించసాగాడు. అతని ఆగడాలు భరించలేని కొందరు పోలీసులను ఆశ్రయించడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు.