శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (12:32 IST)

హైకోర్టు వద్ద అందరూ చుస్తుండగా, పట్టపగలు దారుణం హత్య

murder
తెలంగాణ హైకోర్టు వద్ద పట్టపగలు, అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైకోర్టు గేట్ నంబరు 6 వద్ద ఓ వ్యక్తిని గుర్తు ఓ దుండగుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేసాడు. హైకోర్టు వద్ద అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. వ్యక్తిని హత్య చేసిన తర్వాత దుండగులు అక్కడ నుంచి పారిపోయాడు. 
 
వీరిద్దరి మధ్య కేవలం పది వేల రూపాయల వ్యవహారంలో గొడవ జరిగినట్టు సమాచారం. దీని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.