1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. IndiGo Passenger Tries to Open Emergency Exit Before Take-Off

ఇండిగో విమానంలో అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుడు

indigo flight
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం అర్ధరాత్రి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు గందరగోళం సృష్టించాడు. శంషాబాద్ నుండి కడపకు వెళ్లాల్సిన ఈ విమానంలో, సదరు ప్రయాణికుడు అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. 
 
వెంటనే స్పందించిన విమానయాన సంస్థ సిబ్బంది అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం ఆ ప్రయాణికుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ఎందుకు ప్రయత్నించాడనే విషయంపై విచారణ చేపట్టారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక ఇతర కారణాలతో అలా చేశాడా? అనే కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు అసలు కారణం దర్యాప్తులో తేలాల్సి ఉంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
తెలంగాణలో రెండు వారాల పాటు మార్చి నెల తరహా ఎండలు