నాలోని రగ్గడ్ లుక్ను బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది.. కేటీఆర్ (video)
KTR
కేటీఆర్ కూడా ఇదే కోవకు చెందినప్పటికీ, ఆయన దుస్తుల ఎంపికలో మాత్రం కొంత వైవిధ్యం చూపుతుంటారు. బయటకు వెళ్లేటప్పుడు రకరకాల రంగుల్లో కనిపిస్తుంటారు. తాజాగా ఆయన తన బాహ్య రూపంలో కూడా మార్పు చేసుకున్నారు.
గోదావరిఖనిలో సింగరేణి కార్మికులకు మద్దతు తెలపడానికి వచ్చిన కేటీఆర్, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ముఖంపై గడ్డంతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ విషయంపై స్పందిస్తూ కేటీఆర్ స్పందిస్తూ.."కష్టపడి పనిచేసే నా సింగరేణి సోదరులకు మద్దతుగా వచ్చాను. అందుకే, నాలోని రగ్గడ్ కోణాన్ని బయటకు తీసుకురావాల్సిన సమయం వచ్చిందనిపించింది." అని చెప్పారు.
ఇకపై ఈ గడ్డం తన సాధారణ రూపంలో భాగంగా ఉంటుంది. గడ్డంతో కూడిన ఈ కొత్త మాస్, రగ్గడ్ లుక్లో కేటీఆర్ను చూడటం అందరికీ ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. ఆయన ఇలా గడ్డంతో బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి, దీనిపై ఇప్పటికే చర్చ మొదలైందని చెప్పారు.
గోదావరిఖని పర్యటనకు బయలుదేరిన రామన్న ఈరోజు సాయంత్రం గోదావరిఖనిలో జరిగే సింగరేణి కార్మిక గర్జన సభకు హాజరుకానున్న రామన్న @KTRBRS https://t.co/kpSm8EGeQk
— KTR News (@KTR_News) October 14, 2026

