బెయిల్‌పై విడుదలైన జానీ మాస్టర్.. ఎర్ర కండువాతో కనిపించారంటే? (video)
Jani Master
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఎన్నికలకు ముందు జానీ మాస్టర్ కీలక బాధ్యతలు నిర్వహించాడు. అయితే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో.. వెంటనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయిన్నప్పటికీ ఇప్పుడు జానీ ఎర్రగా కండువాతో కనిపించడం ఆసక్తికరంగా మారింది. జైలు నుంచి వస్తూనే జానీ మాస్టర్ ఎర్ర కండువాతో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది
లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపులకు సంబంధించి జీరో ఎఫ్‌ఐఆర్ కాగా, అదే రోజున నార్సింగ్ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
— BIG TV Breaking News (@bigtvtelugu) October 25, 2024
హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్
36 రోజులు చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్@AlwaysJani #JaniMaster #JaniMastercase #Bigtv pic.twitter.com/ADcMzpzijq
