సంబంధిత వార్తలు
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కేసీఆర్ కుమార్తెకు సీబీఐ నోటీసులు
- ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం - కవితకు ఈడీ నోటీసులు
- హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం నో నాన్ వెజ్
- ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌లకు శిక్ష తప్పదు... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
- తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు-పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
మోదీ పిరికి రాజకీయ నాయకుడు.. కవిత అరెస్ట్‌పై కేసీఆర్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కె.కవిత అరెస్టయిన నెల రోజుల తర్వాత, కేసీఆర్ ఎట్టకేలకు బహిరంగ వేదికపై ఈ విషయంపై స్పందిచారు. ఢిల్లీ లిక్కర్ కేసు తమ ప్రత్యర్థులపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ తెరతీసిన రాజకీయ ప్రతీకార కేసు తప్ప మరొకటి కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
"మోదీ పిరికి రాజకీయ నాయకుడు, అసెంబ్లీలో మా బలం 111 ఉండగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నించాడు. కాబట్టి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు వదిలేస్తాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తాడు." అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించాడు.
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం ఉండొచ్చని, అయితే ఏకనాథ్ షిండే కావడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు లేదని కేసీఆర్ అన్నారు. దానికి తోడు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చెప్పారు.
