సంబంధిత వార్తలు
- 554 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలి.. టీజీఎస్సార్టీసీ
- అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ... ప్రఖ్యాత బిజినెస్ కన్సల్టెంట్ భేటీ!
- ఖమ్మం: డార్క్ వెబ్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన టెక్కీ అరెస్ట్.. ఎలాగంటే?
- ప్రతి నెల రెండో శని, ఆదివారాల్లో హైదరాబాదులో వుంటా: చంద్రబాబు
- స్వాతంత్ర దినోత్సవ సంబరాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అత్యధిక ట్రావెల్ బుకింగ్స్
తెలంగాణాలోని ఆ జిల్లాలకు వర్ష సూచన : వాతావరణ శాఖ
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఓ సూచన చేసింది. అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని కోరింది.
ముఖ్యంగా, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.
హైదరాబాద్ నగరంలో రేపు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. మధ్యాహ్నం కాస్త ఎండ వచ్చినప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి జల్లులు కురిసే అవకాశముందని వెల్లడించింది.
తర్వాతి కథనం
