సంబంధిత వార్తలు
- కామారెడ్డితో చిత్తుగా ఓడిన కేసీఆర్.. గజ్వేల్‌లో తక్కువ మెజార్టీతో గట్టెక్కారు...
- ప్రగతి భవన్... ఇక డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ : రేవంత్ రెడ్డి
- తెలంగాణ రాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్ : రేవంత్ రెడ్డిని కలిసి డీజీపీ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు
- గాంధీభవన్: వడ్లు దంచితే బియ్యం-రేవంతన్న సీఎం.. వీడియో ట్రెండ్
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు : కాంగ్రెస్ ఖాతాలో మరో గెలుపు
ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి... పలువురు ఎంపీల అభినందన
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ, గురువారం జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెల్సిందే. ఇపుడు కొడంగల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన బుధవారం లోక్‌సభ సచివాలయానికి వెళ్లి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందచేస్తారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాలకు హాజరైన పలువురు ఎంపీలు రేవంత్ రూం నెంబర్ 66లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని పలువురు ఎంపీలు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
