సంబంధిత వార్తలు
- తెలంగాణాకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటు వేద్దామా? సీఎం రేవంత్ రెడ్డి
- చరిత్రను గుర్తు చేసుకోవయ్యా రేవంతన్న.. కేటీఆర్ ధ్వజం
- "ట్యాపింగ్ టిల్లు" అంటూ కేటీఆర్‌పై బీజేపీ స్పూఫ్ సాంగ్
- దూలంలా పెరిగాడు, దూడకున్న బుద్ధి వుండాలె: హరీశ్ రావుపై రేవంత్ పంచ్ డైలాగ్స్
- కేసీఆర్ ఇంటర్వ్యూ.. అవును వైఎస్సార్ సంక్షేమ పథకాలను అనుసరించాను..
తెలంగాణ అడిగింది.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు... గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న సీఎం రేవంత్!!
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చి తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రం అడిగింది ఏంటి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అనే అంశాలను ఆయన ఏకరవు పెట్టారు. పదేళ్ళుగా ప్రధానిగా ఉన్న నరంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమన్నారు. ఎన్నో అడిగితే మోడీ ప్రభుత్వం మాత్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. పైగా, మంగళవారం గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న ఫోటోను ఆయన అటాచ్ చేశారు.
తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా : బీజేపీ ఇచ్చింది... గాడిద గుడ్డు
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు
తెలంగాణ అడిగింది... బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ : బీజేపీ ఇ్చచింది గాడిద గుడ్డు
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరి జలాల్ల వాటాల పంపకం : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయ హోదా : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు
తెలంగాణ అడిగింది... తెలంగాణ అభివృద్ధి.. దీనికి బీజేపీ అడ్డుకాగా, తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అంటూ ట్వీట్ చేశారు.
