1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. 20 Injured by Firecrackers in Hyderabad

దీపావళి వేడుకల్లో అపశృతి : గాయాలపాలైన 27 మంది

Hyderabad
హైదరాబాద్ నగరంలో జరిగిన దీపావళి పేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పలు ప్రాంతాల్లో బాణాసంచా పేల్చే సమయంలో ఏర్పడిన చిన్నపాటి అగ్నిప్రమాదాల్లో అనేక మంది గాయపడ్డారు. ఇలా ఇప్పటివరకు 27 మంది గాయపడ్డారు. వీరందరినీ మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించారు. 
 
ఇందులో స్వల్పంగా గాయాలైన 22 మందికి చికిత్స అందించి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 
 
పాతబస్తీలోని ఛత్రినాక పరిధిలో ఉన్న కందికల్‌ గేటు దగ్గర పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కందికల్‌లోని పీవోపీతో బొమ్మలు తయారుచేసే పరిశ్రమలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
దీంతో పశ్చిమబెంగాల్‌కు చెందిన విష్ణు, జగన్‌ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలిచారు. పటాకులకు రసాయనాలు తోడవడంతో పేలుడు తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
నేల చూపులు చూస్తున్న పెట్రోల్ ధర - తెలుగు రాష్ట్రాల్లో మాత్రం?