సంబంధిత వార్తలు
- ప్రేమించినవాడిని నమ్మి వెళితే... అలా చేశాడు... 3వేల మంది అనుభవించారు...
- పెళ్లి చేస్కుంటానని లొంగదీసుకున్నాడు... కేసు పెడితే పోలీసులు అలా చేశారు(వీడియో)
- గ్యాస్ ట్రబుల్ అనుకుంటే 7నెలల నిండు గర్భిణి.. ఎక్కడ?
- ప్రేమించానని.. ఒకరోజు రాత్రంతా గడిపి.. ఆ తరువాత(వీడియో)
- తెలంగాణలో రైతు బంధు పథకం... పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్ నేతలు..!
ముఖ్యమంత్రి పి.ఏనంటూ బుగ్గ కారుతో హల్చల్... బోగస్ గన్ మేన్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ పలువురిని నమ్మించి పోలీసులకు చిక్కాడు నేరస్థుడు. సచివాలయంలో తనకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.70 లక్షల్ని వసూలు చేశాడు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు దర్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ పలువురిని నమ్మించి పోలీసులకు చిక్కాడు నేరస్థుడు. సచివాలయంలో తనకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.70 లక్షల్ని వసూలు చేశాడు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు దర్యాప్తు చేయడంతో అతడి బండారం బయటపడింది.
వరంగల్ మండీబజార్‌కు చెందిన మహ్మద్ ఖిఫాయత్ అలీ(29) ప్రైవేటు ఉద్యోగి. తెలంగాణ సీఎం సలహాదారుకు వ్యక్తిగత సహాయకుడినంటూ తన ఇంటి ముందు బోర్డు తగిలించుకున్నాడు.
తన కారుకు ఎర్రబుగ్గ తగిలించుకొని స్థానికంగా హడావుడి చేసేవాడు. ఇఫ్తార్ విందుల పేరిట ప్రముఖుల్ని పిలిచి హంగామా చేసేవాడు. తన మిత్రుడుకు సఫారీ సూట్ వేసి గన్ మేన్ లా నటించమనేవాబు. ఖిఫాయత్ అలీ హడావుడి చూసి అతడు నిజంగానే సచివాలయ ఉద్యోగి అని స్థానికులు నమ్మారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్, నంద్యాలకు చెందిన ఇరవై మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశాడు. బాధితులెవరైనా గట్టిగా అడిగితే వారిని సచివాలయం వద్దకు రప్పించేవాడు. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇస్తారంటూ నమ్మించి పంపించేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయిండంతో దొరికిపోయాడు.