1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BTech student killed in Banjara Hills road mishap

అతివేగానికి బీటెక్ విద్యార్థి మృతి.. బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం (Video)

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్‌ 3లోని జంక్షన్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టి... ఆ తర్

BTech student
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్‌ 3లోని జంక్షన్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా డివైడర్‌ను ఢీకొట్టి... ఆ తర్వాత అదుపుతప్పి పల్టీలు కొట్టి పూర్తిగా తిరగపడి ధ్వంసమైంది. 
 
ఈ ఘటనలోఒక ఫర్సత్‌ అలీ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు ఫర్సత్‌ ముఫకంజా కాలేజీలో బీటెక్ చదువుతూ ఎమ్మెల్యేకాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని పోలీసులు అతి కష్టంమీద బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
 
కారులో చనిపోయిన వ్యక్తి బాగా ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ధ్వంసమైన కారును క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌‌ను క్లియర్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గురైన కారు ఎంత వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టిందో కింది వీడియో చూడండి. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మరో 40 యేళ్ళు జగనే సిఎం... నవ హామీలపై నా సవాల్... రోజా(వీడియో)