సంబంధిత వార్తలు
- కాలేజీ ఫీజు చెల్లించలేక... బీటెక్ విద్యార్థిని సూసైడ్ - బాబు, పవన్ ఆవేదన
- బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య: పవన్ కల్యాణ్ మండిపాటు
- బీహార్ విద్యార్థులకు శుభవార్త : డిగ్రీ పాస్ అయితే రూ.50 వేలు
- చిత్తూరులో మరో మదనపల్లి ఘటన : దేవుడి వద్దకు వెళుతున్నాననీ...
- డిగ్రీ విద్యార్థులకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు.. ప్రమోట్ అయినా పరీక్షలు రాయాల్సిందే...
ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థిని శీలాన్ని కాటేసిన కామాంధుడు...
హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో నమ్మించిన ఇంటికి పిలిచిన బీటెక్ విద్యార్థి.. అత్యాచారానికి పాల్పడ్డాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రహమత్‌నగర్ సమీపంలోని కార్మికనగర్‌లో నివసించే విద్యార్థిని (23) బీకాం చదువుతోంది. అదేప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి రాజు(23) ఆమెతో మాట్లాడాలని శుక్రవారం ఇంటికి పిలిచాడు.
పెళ్లి విషయమై మాట్లాడుకుందామని చెప్పడంతో ఆ యువతి అతని మాటలు నమ్మి ఇంటికి వచ్చింది. ఇదే అదునుగా భావించిన బిటెక్ విద్యార్థి.. ఆమెను ఇంట్లో బంధించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకున్న యువతి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తర్వాతి కథనం
