సంబంధిత వార్తలు
- కరోనా వైరస్ మూడో దశకు వెళితే ప్రమాదకరం, డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, డైరెక్టర్, ఢిల్లీ ఎయిమ్స్
- నిర్మల్ జిల్లాలో మరో ముగ్గురికి కరోనా వైరస్ నిర్ధారణ
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనా విపత్తు డబ్బు అడిగినందుకు కత్తితో నరికిన వాలంటీర్, ఎక్కడ?
- ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న చెన్నై జనం, కరోనా కేసులు 621
మాస్కు లేకుండా తెలంగాణలో తిరగడానికి వీల్లేదు
కరోనా వైరస్ పరిస్థితుల నేపధ్యంలో మాస్క్‌ల తయారీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ)లకు అప్పగించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌ల వినియోగం పెరగడం వల్ల మున్సిపల్ కమిషనర్లు, మెప్మా మిషన్ కో–ఆర్డినేటర్లతో జూమ్ టెక్నాలజీ వినియోగంతో వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న స్వయం సహాయ సంఘాల మహిళలు ఇంటి వద్దే తమ వద్ద ఉన్న కుట్టు మిషిన్ల ద్వారా యుద్ద ప్రాతిపదికన దాదాపు మూడు లక్షల మాస్క్‌ల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మహిళా సంఘాలు తయారు చేసి ఇచ్చే మాస్క్‌లను ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్న 139 స్థానిక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు(జీహెచ్ఎంసీ మినహా) కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది.
ఒక్కొక్క మాస్క్ తయారీకి అయ్యే ఖర్చును కనిష్టంగా రూ.10లు, గరిష్టంగా రూ.14ల చొప్పున కొనుగోలు చేసేందుకు పరిపాలన అనుమతులు ఇచ్చారు.
రెండు మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహించే మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సిబ్బంది, వీధి విక్రయదారులు(స్ట్రీట్ వెండర్స్) ఎవ్వరూ కూడా మాస్క్ ధరించకుండా తిరగడానికి వీలులేదని డైరెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు.
