సంబంధిత వార్తలు
- ఢిల్లీలో గాలిపీల్చి సగం చచ్చిపోయాం.. ఇక మమ్మల్ని చంపేదేముంది.. నిర్భయ దోషి
- నన్ను ఢిల్లీ వాయు కాలుష్యం చంపేస్తుంది, ఇంకెందుకు ఉరి? సుప్రీంలో నిర్భయ దోషి
- తొమ్మిది నెలల పాప హత్య కేసులో సుప్రీంకోర్టుకు వరంగల్ పోలీసులు
- ఎన్కౌంటర్లపై ఎన్హెచ్ఆర్సీ మార్గదర్శకాలు.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవీ..
- దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్... బాలకృష్ణ ఏమన్నారంటే...
దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై నేడు సుప్రీంలో విచారణ
హైదరాబాద్ దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ఈ రోజు విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. “దిశ” అత్యాచారం, హత్య కేసు నిందితులను బూటకపు ఎన్ కౌంటర్ ద్వారా హతమార్చారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఇద్దరు న్యాయవాదులు జీ.ఎస్ మనీ ప్రదీప్, కుమార్ యాదవ్‌లు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
నిందితులు నేరారోపణ ఎదుర్కొంటున్నప్పటికీ, వారికి జీవించే హక్కు ఉంటుందని ఈ ఇద్దరు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులతో పాటు, కమిషనర్ సజ్జనార్ పైన కూడా విచారణ జరపాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఎన్ కౌంటర్ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, ఆదేశాలను సైతం పోలీసులు ఉల్లంఘించారంటూ ఈ ఇద్దరు పిటిషనర్లు ఒక నివేదికను సుప్రీం ముందు ఉంచారు. దీంతో సుప్రీం కోర్టు తమ ఎదుట హాజరు కావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆదేశించిన నేపధ్యంలో ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు.