సంబంధిత వార్తలు
- రెండోసారి కరోనావైరస్ వస్తే దాని తీవ్రత అధికం అంటున్న అమెరికా వైద్యులు
- కోవిడ్‌ను ఓడించిన ట్రంప్... వైద్య చికిత్స పూర్తయిందట... వైద్యుల ప్రకటన
- యువకుడి పొట్టలో కుట్టు సూదులు, గోర్లు, స్క్రూ డ్రైవర్లు
- కరోనా నుంచి కోలుకున్నా.. తనకిప్పుడు 20 యేళ్ళ వయసు తగ్గిపోయింది : ట్రంప్
- విషమంగా డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం.. వచ్చే 48 గంటలే కీలకం!!!
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు..
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చికిత్స కోసం వచ్చిన వ్యక్తి కడుపులో కత్తెర మరిచిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసిన కొన్ని రోజులకి అనంతరం కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు వరంగల్ ఎంజీఎం వైద్యులు. బెల్లంపల్లిలోని శాంతిగనికి చెందిన రాజు వరంగల్ ఎంజీఎంలో ఆపరేషన్ చేయించుకున్నారు.
అయితే తాజాగా మరోసారి కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకి వచ్చాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులకి కడుపులో కత్తెర ఉన్నట్లు కనిపించిది. దీంతో- బాధితుడికి, అతని కుటుంబ సబ్యులకు తెలియకుండా, బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచి మరోసారి ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆ వృద్ధుడికి అసలు విషయం తెలియ పర్చకుండా ఎలా చెప్పాలి అనే దాని మీద ఎంజీఎం సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
తర్వాతి కథనం
