1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Explosion in secunderabad dust place near Mutyalamma Temple

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు!

Secunderabad
దసరా పండుగ వేళ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. ఆలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్థాలను తొలగించేందుకు వచ్చిన ఓ వ్యక్తి, దానిలో కనిపించిన పెయింట్ డబ్బాను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, భారీ శబ్దంతో అది పేలింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డబ్బాలో చెత్త ఏరుకుంటుండగా పేలుడు జరిగినట్లు సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, డాగ్ స్క్వాడ్, ఇతర అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. పేలింది ఓ టిన్నర్ డబ్బా అని ప్రాథమికంగా తేల్చారు. దసరా పండగ నాడు ఈ ఘటన జరగడంతో, ఆలయంలోని భక్తులతో పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జరిగిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. చెత్తకుప్పలో ఉన్న పెయింట్‌ డబ్బా పేలిందని పోలీసులు గుర్తించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
 
తర్వాతి కథనం
దేశంలో పెరిగిన రికవరీ రేటు... తగ్గుతున్న మరణాల సంఖ్య