సంబంధిత వార్తలు
- నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...
- డాడీ.. నీ ఫ్రెండే వేధిస్తున్నాడు.. నీతో చెప్పుకోలేక చచ్చిపోతున్నా...
- నిన్న మిర్యాలగూడలో.. నేడు ఎర్రగడ్డలో.. ప్రేమజంటపై వధువు తండ్రిదాడి
- మారుతీ రావు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏంటి? అమృతను కిడ్నాప్ చేసి?
- రూ.3 కోట్లకు సిద్ధపడ్డా.. రూ.కోటి ఖర్చుచేసి ప్రణయ్‌ని లేకుండా చేస్తా : మారుతిరావు శపథం
మా నాన్న మాపై ఏం చేస్తాడో తెలుసా? అక్కాచెల్లెళ్లు చెప్పింది వినీ...
నాన్నంటే మమకారం. నాన్నంటే ఓ ధైర్యం. అటువంటి ఓ నాన్న కన్న మమకారాన్ని మానవత్వాన్ని మట్టిలో కలిపాడు. లైంగిక సుఖం కోసం కన్నబిడ్డలనే వాడుకుంటున్నాడు.
నాన్నంటే మమకారం. నాన్నంటే ఓ ధైర్యం. అటువంటి ఓ నాన్న కన్న మమకారాన్ని మానవత్వాన్ని మట్టిలో కలిపాడు. లైంగిక సుఖం కోసం కన్నబిడ్డలనే వాడుకుంటున్నాడు. నాన్న ఏం చేస్తున్నాడో తెలియక ఆ చిన్నారులు ఇద్దరూ అయోమయంలో ఉన్నారు.
వివరాలుల్లోకి వెళితే చిన్నారలపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో అల్వాల్‌లోని బాలికల పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది బాలల హక్కుల సంఘం అనే స్వచ్చంధసంస్థ. ‘గుడ్ టచ్... బ్యాడ్ టచ్..’ల పేరిట లైంగిక దాడులు ఏవిధంగా జరగుతాయో చిన్నారులకు వివరించారు ఆ సంస్థ సభ్యులు. దీంతో తమ తండ్రి చేస్తున్న అఘాయిత్యాలను 10, 5 ఏళ్ల వయసున్న ఆ అక్కాచెల్లెళ్లు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
పదేళ్ల వయసున్న కూతురిపై ఏడాదిగా లైంగిక దాడి చేస్తూ.. ఇటీవల ఐదేళ్ల కుమార్తె పైన తన ఆటవిక చర్యలను మొదలుపెట్టాడు. బాలికల తల్లి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనిని భరించారు ఆ అక్కాచెల్లెళ్లు. దీనపై సమాచారం అందుకున్న బాలల సంక్షేమ శాఖ ఛైర్మన్ పద్మావతి విచారణ జరిపి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు.
