మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:15 IST)

మారుతీ రావు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏంటి? అమృతను కిడ్నాప్ చేసి?

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న

మిర్యాలగూడ పరువు హత్యలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయినా ప్రణయ్ తండ్రి పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య కేసులో పోలీసులపై తనకు విశ్వాసం వున్నప్పటికీ.. కత్తిపై వున్న వేలిముద్రలు, బీహార్‌లో పట్టుబడిన హంతకుడు శర్మ వేలిముద్రలు ఒకటా కాదా అనే విషయాన్ని ఎస్పీగారు చెప్పలేదన్నారు. 
 
వేలిముద్రలు ధ్రువీకరణ కాకపోతే హంతకుడు తప్పించుకునే అవకాశం ఉంది. హంతకుడు డబ్బున్న వాడు అయినందున చేసిన పనికి ఉరిశిక్ష పడితేనే మేం సంతోషిస్తాం. మారుతీరావు బయటకు వస్తే మళ్లీ ఇలాంటి హత్యలే చేస్తాడని భయమేస్తోందని ప్రణయ్ తండ్రి వాపోయాడు. 
 
ప్రణయ్‌ని చంపిన వాడు రేపు మమ్మల్ని చంపడని గ్యారెంటీ ఏముంది..? అమ్మాయి అమృతను కిడ్నాప్‌ చేసి మానుంచి దూరం చేసే ప్రమాదమూ ఉంది. అందుకే నిందితులపై పీడీయాక్ట్‌ పెట్టి, కొత్త చట్టాలను తెచ్చి జైలు నుంచి బయటకు రాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై వుందని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు.