1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad shivers under grip of cold wave

హైదరాబాదును వణికిస్తోన్న చలి గాలులు.. ఎల్లో అలెర్ట్

cold wave
హైదరాబాదును చలి వణికిస్తోంది. చలిగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత 24 గంటల్లో రాజేంద్రనగర్‌లోని వాతావరణ కేంద్రం కనిష్టంగా 7.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు తెలిపింది. హైదరాబాద్‌లో చలి గాలులతో అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
హైదరాబాదులో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ సొసైటీ అందించిన వివరాల ప్రకారం జనవరిలో హైదరాబాద్ సగటు కనిష్ట ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియస్. గరిష్టంగా 28.3 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది.
 
రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ-హైదరాబాద్‌ అంచనా వేసింది. హైదరాబాద్ ఈశాన్య ప్రాంతాల్లో ఉదయం పూట పాదరసం స్థాయిలు భారీగా తగ్గడంతో పొగమంచు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
 
చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉన్నందున రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా, IMD-H ప్రకారం, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలుల ఎక్కువగా వీసే ఉండే అవకాశం ఉంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
హైదరాబాద్‌లో అరుదైన పిల్లి కిడ్నాప్.. పోలీసులకు ఫిర్యాదు