ఆదివారం, 10 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

అవి పాచినోళ్లు.. పాలసీపై మాట్లాడటం తెలియదు.. రోజాకు పవన్ కౌంటర్

pawan kalyan
తనపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే.రోజాకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును పవన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 
 
తన గురించి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అవి పాచినోళ్లు.. పాలసీ గురించి తెలయక ఏవేవో మాట్లాడుతుంటారు. నీటిపారుదల శాఖామంత్రికి పోలవరం గురించి తెలియదు. ఇంకా చాలా ప్రశ్నలకు శ్రీకాకుళంలో జరిగే జనసేన యువశక్తి సభలో సమాధానాలు చెబుతాను అని చెప్పారు. 
 
ఇకపోతే, ఏపీలో తమకు ఎదురే ఉండకూడదని వైకాపా నేతలు భావిస్తున్నారు. అందుకే అరాచకాలకు శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. మున్ముందు వైకాపా విశ్వరూపం చూడాల్సి ఉంటుంది. తాను ఏ చిన్న పని చేసినా వైకాపా నేతలు టార్గెట్ చేయడం వారికి అలవాటు అయిపోయింది. వారాహి వాహనం కొనుగోలు చేసినా అది వారికి కడుపుమంటే. అందుకే ఆ వాహనం రిజిస్ట్రేషన్‌‍పై పెద్ద వివాదం సృష్టించారు అని అన్నారు.