ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (15:10 IST)

జనవరి నుంచి రూ.2750లకు పెన్షన్‌ను పెంచుతాం.. ఏపీ సీఎం జగన్

ys jagan
ఏపీలో జనవరి నెల నుంచి రూ.2500లు ఉన్న పెన్షన్ ను రూ.2750లకు పెంచుతున్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో రూ.11కోట్లతో నిర్మించిన ప్రభుత్వ ఆఫీసుల కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనవరి నెల నుంచి పెన్షన్ రూ.2750లకు పెరుగుతుందన్నారు. ఇది మహిళల ప్రభుత్వమన్నారు. ప్రతి మహిళకు ఏటా రూ. 18,750లు ఇస్తున్నామన్నారు.
 
పనిలో పనిగా విపక్ష నేత, మాజీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంకు చంద్రబాబు ఎమ్మెల్యేనే అయినా నాన్ లోకల్ గా మారిపోయాడని, హైదరాబాద్‌కు లోకల్ అయ్యాడని ఎద్దేవా చేశారు. 
 
కుప్పం నుంచి తనకు కావాల్సినంత రాబట్టుకున్నాడని, ప్రజలకు మాత్రం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లు వేయించుకోవడంలో బాబుకు ఉన్న అనుభవం గురించి ఈ జిల్లాలో కథలు కథలుగా చెప్పుకుంటుంటారని తెలిపారు. గత 30 ఏళ్లుగా వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఎవరూ అంటే, అది చంద్రబాబేనని అన్నారు. కుప్పంపై కూడా చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమే ఉందని విమర్శించారు.