1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Hyderabad Tank Bund Traffic Rules from This Sunday

ప్రతి సండే ట్రాఫిక్ ఆంక్షలే ... సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు..

Tank Bund
సాధారణంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై రద్దీగా ఉంటుంది. ఈ రద్దీ ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్‌ బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించాలని హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం నిర్ణయించింది. 
 
వారాంతంలో ట్యాంక్‌బండ్‌ అందాలను వీక్షించి ఆస్వాదించేందుకు ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఒక నెటిజన్‌ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావుకు విజ్ఞప్తి చేయగా దానిపై ఆయన వెంటనే స్పందించారు. 
 
ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ను దారి మళ్లించాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఆదేశించారు. దీనికి అనుగుణంగా వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు. 
 
ఈ కొత్త నిర్ణయంతో హైదరాబాద్ నగరంలో ఎప్పుడు రద్దీగా ఉండే ట్యాంక్ బండ్‌పై ఇకపై ప్రతి ఆదివారం కాస్త ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సిరానుంది. అదేసమయంలో ట్రాఫిక్ మళ్లింపు నిర్ణయంతో ట్యాంక్ బండ్ వీక్షణకు మరింతమంది సందర్శకులు తరలివస్తారని భావిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం.. ఎందుకో తెలుసా?